ETV Bharat / state

ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు కొవిడ్​ నుంచి త్వరగా కోలుకోవాలంటూ పూజలు

మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కరోనా నుంచి కోలుకోవాలని కోరుతూ కాంగ్రెస్ శ్రేణులు అనేక దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. కన్నాల గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామికి 101 కొబ్బరికాయలు కొట్టి విశేష అభిషేకాలు నిర్వహించారు.

author img

By

Published : Nov 7, 2020, 6:59 PM IST

manthani Congress party workers special poojas to MLA Sridhar Babu's recovery from Corona
ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు కొవిడ్​ నుంచి త్వరగా కోలుకోవాలంటూ పూజలు

పెద్దపల్లి జిల్లా మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తమ అభిమాన నేత త్వరితగతిన కొవిడ్​ నుంచి కోలుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు మంథని, మల్హర్ మండలాల్లోని దేవాలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. కన్నాల గ్రామంలో వెలిసిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంథని ఎస్సీసెల్ కాంగ్రెస్​ శ్రేణుల ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలను కొట్టి స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు.

కాంగ్రెస్ బీసీసెల్, మైనారిటీ సెల్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని దత్త దేవాలయంలో ప్రత్యేక పూజలు, మల్హర్ మండలం తాడిచర్ల గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో పంచామృతాలు, పండ్లరసాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తమ ప్రియతమ నేత ఎమ్మెల్యే శ్రీధర్​బాబు ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,607 కరోనా కేసులు, 6 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.