ETV Bharat / state

'రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తాం' - mansukh-mandaviya

పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఆర్​ఎఫ్​సీఎల్​ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ సందర్శించారు. నవంబర్ నాటికి ఆర్​ఎఫ్​సీఎల్లో యారియా ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు.

mansukh-mandaviya-said-we-will-make-no-urea-deficient-for-farmers-in-telangana
'రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తాం'
author img

By

Published : Sep 12, 2020, 8:40 PM IST

'రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తాం'

దేశంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తామని, కొత్తగా ఐదు యూరియా ఫ్యాక్టరీలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తోన్న ఆర్​ఎఫ్​సీఎల్​ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు.

పనుల పరిశీలన

సాగు పెరగటం వల్ల యూరియా సరిపోవటం లేదని.. ఇతర దేశాల నుంచి 2.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటున్నట్లు మాండవీయ అన్నారు. నవంబర్ నాటికి ఆర్​ఎఫ్​సీఎల్లో యారియా ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు తీరుతాయన్నారు. 99 శాతం పనులు పూర్తయ్యాయని.. ట్రయిల్ రన్​కు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా కారణంగా కొంత పనులు ఆలస్యం అయిందని పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగ కల్పనపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం పనులను పరిశీలించారు.

పోలీసుల నిర్లక్ష్యం

తెరాస ఎంపీ వెంకటేశ్​ నేత, ఎమ్మెల్యేల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి పనులను పరిశీలించడానికి వస్తే అడ్డుకోవటమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతుందన్నారు. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. పోలీసులు తమను రోడ్డుపై గంటసేపు నిలబెట్టారని.. పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు. గతంలో మంత్రి సదానంద గౌడ్​పై కూడా ఇలానే పోలీసులు పేక్షకపాత్ర వహించారన్నారు. పోలీసులపై చర్య తీసుకోవాలని డీజీపీని కిషన్ రెడ్డి కోరారు.

ఇదీ చూడండి : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మరోసారి కరోనా పరీక్షలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.