తనకు మంజూరు చేసిన గొర్రెల యూనిట్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... పెద్దపల్లి జిల్లా పశుసంవర్థకశాఖ కార్యాలయం ముందు ఆవుల నర్సయ్య అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన నర్సయ్యకు 2018లో గొర్రెల యూనిట్ మంజూరైంది. అయనా ఇప్పటికీ తనకు మందల పశువైద్యాధికారి యూనిట్ విడుదల చేయలేదని నర్సయ్య ఆరోపిస్తున్నాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేని మనస్తాపం చెంది... వెంట తెచ్చుకున్న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కార్యాలయానికి వచ్చిన వారు గమనించి అతణ్ని రక్షించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళన విరమింపజేశారు.
ఇదీ చూడండి: పాముకాటుతో తరగతి గదిలోనే విద్యార్థిని మృతి