పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ సీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రంతో కలిసి మాసశివరాత్రి రావడం వల్ల లోక కల్యాణార్థం మహాలింగార్చన కార్యక్రమాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. దేవాలయంలోని శ్రీ సీలేశ్వర సిద్ధేశ్వర మూలవిరాట్లకు పూజలు నిర్వహించారు. మట్టితో లింగాలను ప్రతిష్టించి పంచామృతాలు, పండ్ల రసాలు, గోదావరి జలాలతో అభిషేకాలు చేపట్టారు. ధూప దీప నైవేద్యాలు, మంగళ హారతులు సమర్పించారు. తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
సీలేశ్వర సిద్ధేశ్వరాలయంలో మహా లింగార్చన - మంథనిలో మహాలింగార్చన కార్యక్రమం
పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ సీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించారు.