ETV Bharat / state

తక్కువ ఖర్చుతో ఇంక్యుబేటర్లు... రైతన్నల నుంచి ప్రశంసలు

ఉన్నత చదువులు చదువుకున్నా... రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించారు. ముఖ్యంగా కోళ్లపెంపకం దారులకు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను అధిగమించే దిశగా అడుగులు వేసి విజయం సాధించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా పేరొందిన కోళ్లను పొదిగేందుకు వినియోగించే ఇంక్యుబేటర్లు సన్నచిన్నకారు రైతులకు అందుబాటులోకి తీసుకురాగలిగారు. లక్షల్లో ఖర్చు చేయాల్సిన ఇంక్యుబేటర్లు కేవలం వేల రూపాయల్లో రూపొందించి రైతుల మన్ననలు పొందుతున్నారు. ఇంక్యుబేటర్లను రూపొందించిన ముగ్గురు అన్నదమ్ములు... కోళ్లపెంపకంలో తీసుకోవాల్సిన మెళకువలు ఉచితంగా నేర్పుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Low cost incubators made by 3young boys in peddapalli district
తక్కువ ఖర్చుతో ఇంక్యుబేటర్లు రూపొందించి... రైతుల మన్నన పొంది
author img

By

Published : Jul 2, 2020, 5:47 PM IST

Updated : Jul 2, 2020, 7:03 PM IST

పెద్దపల్లి జిల్లా రాయదండి రైతు కుటుంబానికి చెందిన పల్లెరాజు మాస్టర్స్ డిగ్రీ, శ్యాంసుందర్‌ బీటెక్‌, సతీశ్​ డిగ్రీ పూర్తి చేసినప్పటికీ... ఉద్యోగాల కోసం వేచిచూడకుండా వ్యవసాయ అనుబంధ రంగంవైపు దృష్టి సారించారు. చిన్ననాటి నుంచి వ్యవసాయ అనుబంధ రంగాలంటే ముగ్గురికి ఆసక్తి. ముఖ్యంగా పెద్దగా పెట్టుబడి లేకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన కోళ్ల పెంపకం ప్రారంభించారు.

రూపకల్పన..

ఇప్పటికే బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమలు కొనసాగుతుండగా... దేశీయ కోళ్లకు మంచి గిరాకీ ఉంటుందన్న ఉద్దేశంతో దేశీయ కోళ్లతో పాటు కడక్‌నాథ్ కోళ్లు, గిరిరాజ కోళ్లను పెంచుతున్నారు. చిన్నచిన్న రైతులు కోడిగుడ్లను పొదిగే యంత్రాలు కొనుగోలు చేయాలంటే కనీసం లక్షన్నర రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిని గమనించిన ముగ్గురు సోదరులు.. వేలకోడిగుడ్లను పొదిగే యంత్రం కాకుండా 100నుంచి 1,000 గుడ్ల వరకు పొదిగే యంత్ర రూపకల్పనకు శ్రీకారం చుట్టారు.

రైతుకు ప్రయోజనం..

ఈ యంత్ర రూపకల్పనలో 10 నుంచి 12సార్లు విఫలమైనా... చివరికి విజయం సాధించారు. భారీ పెట్టుబడులు కాకుండా మహిళా సంఘాలు, సన్నచిన్నకారు రైతులు తమ ఇళ్లలోనే కోడిగుడ్లను పొదిగే విధంగా ఇంక్యుబేటర్‌ను రూపొందించినట్లు తెలిపారు. సాధారణంగా గుడ్లను పొదిగి పిల్లలను ఉత్పత్తి అయ్యేందుకు సుమారు 21రోజుల సమయం పడుతుంది. అయితే ఇంక్యుబేటర్‌లోనూ.. అంతే సమయం తీసుకున్నా.. రైతుకు మాత్రం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు ముగ్గురు సోదరులు.

దశలవారీగా..

సాధారణంగా బ్రాయిలర్ కోళ్ల కోసమే ఇప్పటి వరకు ఇంక్యుబేటర్లు అందుబాటులో ఉన్నాయని.. దేశీయ కోళ్ల కోసం మాత్రం తామే రూపొందించామని చెబుతున్నారు. ఒకేసారి 500 నుంచి 1,000 గుడ్లను ఇంక్యుబేటర్లలో పెట్టే కంటే దశల వారీగా పెడితే లాభదాయకంగా ఉంటుందంటున్నారు. ఈ ఇంక్యుబేటర్‌ రూపకల్పనలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు రాజుపటేల్ చెప్పారు.

బల్బుకు అయ్యే ఖర్చు..

ప్రధానంగా ఇంక్యుబేటర్లు కొనుగోలు చేసిన తర్వాత విద్యుత్‌ బిల్లులకు రైతులు బెదిరిపోయి ఇతరులకు అమ్మేస్తుంటారని.. తాము రూపొందించిన ఇంక్యుబేటర్ మాత్రం కేవలం ఒక బల్బుకు అయ్యే విద్యుత్‌ ఖర్చు సరిపోతుందంటున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు తమ వద్ద ఇంక్యుబేటర్లు కొనుగోలు చేశారని... ప్రస్తుతం కరోనా కారణంగా అవసరమైన సామగ్రి అందుబాటులో ఉండటం లేదని యువకులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: ఇసుకాసురుల కబంధ హస్తాల్లో తంగడపల్లి పెద్ద చెరువు

Last Updated : Jul 2, 2020, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.