'ఎల్ఐసీ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకోవాలి' - పెద్దపల్లి వార్తలు
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌కు అప్పగించడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లాకేంద్రంలో ఎల్ఐసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ప్రజల ఆస్తులను ప్రైవేటీకరణ చేయడాన్ని సీఐటీయూ నేత ముత్యం రావు ఖండించారు.
'ఎల్ఐసీ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకోవాలి'
ఎల్ఐసీ ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. విధులు బహిష్కరించి సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణను సీఐటీయూ నేత ముత్యం రావు ఖండించారు. ఉద్యోగులు, వినియోగదారులను ఇబ్బందులకు గురి చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగులు, సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.