పెద్దపల్లి జిల్లా మంథనిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. పర్వదినాన సందడిగా ఉండాల్సిన ఆలయ పరిసరాలు.. భక్తులు లేక బోసిపోయి కనిపించాయి. రాష్ట్రంలో రెండు రోజులుగా పెరిగిన చలి ఓ కారణం కాగా.. కొవిడ్ నేపథ్యంలో ఆలయాలకు భక్తుల తాకిడి తగ్గుముఖం పట్టింది.
స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో జరిగే ఉత్సవాలకు ప్రతీ యేటా లక్షలాదిగా భక్తులు తరలివచ్చేవారు. కరోనా మహమ్మారి భయంతో ఈసారి దేవుడిని దర్శించుకోనేవారి సంఖ్య భారీగా తగ్గినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టత తెలుసా...?