రామగుండంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాత్రిపూట కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు . పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, జాతీయ పట్టణ జీవనోపాధుల విద్యుత్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించిన రాత్రి బస కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. వీటికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు లక్షలు కేటాయిస్తున్నారు. వివిధ వర్గాల వారు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రాత్రి బస కేంద్రంలో చేరిన వారికి దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: సికింద్రాబాద్లో 8వేల కిలోల వెండి పట్టివేత