ETV Bharat / state

ఇటుకల బట్టీ యజమాని కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - ఇటుకల బట్టీ యజమాని కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఇటుకల బట్టీ యజమాని సిద్దయ్య కిడ్నాప్  కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 లక్షల 50 వేల రూపాయల నగదు, మూడు కత్తులు, నాలుగు ముసుగులు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

TRACTOR
ఇటుకల బట్టీ యజమాని కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
author img

By

Published : Dec 3, 2019, 6:05 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఇటుక బట్టీల యజమాని సిద్దయ్య కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. పట్టణంలోని శాంతినగర్​లో నివాసం ఉంటున్న నల్లూరు సిద్దయ్య గౌరెడ్డిపేటలో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు. గత నెల 25న అర్ధరాత్రి సిద్దయ్యను కొందరు వ్యక్తులు ముసుగులు ధరించి అపహరించారు. అనంతరం వ్యాపారి సిద్దయ్య భార్యకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తేనే తన భర్తను వదిలేస్తామని తెలిపారు. భయపడిన సిద్దయ్య భార్య కిడ్నాపర్లకు ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వగా... రెండు ఏటీఎం కార్డులు లాక్కొని పరారయ్యారు.

సీసీటీవీ ఫుటేజితో బయటపడ్డ దొంగల బాగోతం

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వారం రోజుల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు పెద్దపెల్లి పోలీస్ స్టేషన్​లో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ నిందితుల వివరాలను వెల్లడించారు. వ్యాపారి సిద్దయ్య వద్ద డబ్బులు తీసుకొని పరారైన దుండగులు వివిధ జిల్లాల్లో ఏటీఎం కార్డులను వినియోగించినట్లు తెలిపారు. వీటి ఆధారంగా సీసీ ఫుటేజీ సాయంతో దొంగలను పట్టుకున్నట్లు స్పష్టం చేశారు.

నలుగురు పట్టుబడగా... మరో ఇద్దరు పరారీ

సిద్దయ్య ఇటుక బట్టీలో పనిచేస్తున్న గుమాస్తా తిరుపతి ద్వారా అతని వద్ద కోట్లాది రూపాయల నగదు ఉన్నట్లు తెలుసుకున్న కిడ్నాపర్లు కుట్రకు పతకం పన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఘటనలో ప్రధాన నిందితురాలు రజనీతో పాటు మున్నా, కిరీటి, షేక్ బాషా, రమేష్​ను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5 లక్షల 50 వేల రూపాయల నగదు, మూడు కత్తులు, నాలుగు ముసుగులు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

ఇటుకల బట్టీ యజమాని కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

ఇవీ చూడండి: డాక్టర్​ 'దిశ'కు న్యాయం కోసం 15 లక్షల సంతకాలు

Intro:ఫైల్: TG_KRN_42_03_KIDNAPERS AREST_AVB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఇటుక బట్టీల యజమాని సిద్దయ్య కిడ్నాప్ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్న నల్లూరు సిద్దయ్య కు గౌరెడ్డిపేటలో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు. గత నెల 25న అర్ధరాత్రి సిద్దయ్యను కొందరు వ్యక్తులు ముసుగులు ధరించి అపహరించారు. అనంతరం వ్యాపారి సిద్దయ్య భార్యకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తేనే తన భర్తను వదిలేస్తాను దుండగులు తెలిపారు. దీంతో సిద్దయ్య భార్య కిడ్నాపర్ల కు ఎనిమిది లక్షలు ఇవ్వగా రెండు ఏటీఎం కార్డులు సైతం తీసుకొని పరారీ అయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వారం రోజుల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు ఈ మేరకు పెద్దపెల్లి పోలీస్స్టేషన్లో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ నిందితుల వివరాలను వెల్లడించారు. వ్యాపారి సిద్దయ్య వద్ద డబ్బులు తీసుకొని పరారైన విద్యలో వివిధ జిల్లాల్లో ఏటీఎం కార్డులను వినియోగించిన ఆధారంగా సీసీ ఫుటేజీలో సహాయంతో పట్టుబడినట్లు తెలిపారు. సిద్ధ ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న మేనమామ తిరుపతి ద్వారా సిద్దయ్య వద్ద కోట్లాది రూపాయల నగదు ఉంటుందని తెలుసుకొని కిడ్నాప్కు కుట్ర పన్నినట్లు తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితురాలు రజనీ తో పాటు మున్నా, కిరీటి, షేక్ బాషా, రమేష్ ను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అనంతరం వీరి వద్ద రూ.5.50 లక్షల నగదు, మూడు కత్తులు, నాలుగు ముసుగులు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
బైట్: సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.