Forest officials have cheated: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖాన్ సాయిపేట అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం సుమారు 150 మంది చెట్లను నరకడంతో విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు పోలీసులతో వెళ్లి గ్రామస్థులను హెచ్చరించారు. మళ్లీ అటవీ ప్రాంతంలో చెట్లను నరికితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమస్య తీరిపోయిందని అనుకున్న గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు నమ్మించి కేసులు నమోదు చేయడంతో ధర్నాకు దిగారు.
ఇటీవల రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు వచ్చి పోడు భూములకు పట్టాలిచ్చే.. అవకాశం ఉందని ఫోటోలు దిగాలని చెప్పడంతో అటవీ ప్రాంతంలో అధికారులతో కలిసి ఫోటోలు దిగామని గ్రామస్తులు వాపోయారు. వర్షాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో నీరంతా ఊళ్లోకి రావడంతో ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయని బాధితులు తెలిపారు. ప్రభుత్వం కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఎత్తైన ప్రదేశంలో అటవీ ప్రాంతం ఉండడంతో ఇండ్ల నిర్మాణానికి సౌకర్యంగా ఉంటుందని.. ఇటీవల అధికారులు అక్కడ ఫోటోలు దిగమని చెప్పడంతో భూములు ఇస్తారనే ఆశతో 150 మంది చెట్లను నరికామన్నారు.
తాము వ్యవసాయం కోసం చెట్లను నరకలేదని.. కేవలం ఇండ్ల నిర్మాణం కోసం మాత్రమే చెట్లను నరికామని పేర్కొన్నారు. కేవలం 15 మంది పైన కేసు నమోదు చేశారని వాపోయారు. తమపై అక్రమంగా పెట్టిన కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ అధికారుల అక్రమ కేసులను నిరసిస్తూ మంథని అంబేద్కర్ చౌరస్తాలో గ్రామస్తులు ధర్నా చేపట్టారు.
ఇవీ చదవండి: