కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లోని 10వ పంపుకు శనివారం వెట్ రన్ నిర్వహించారు. ఈఎన్ సీ నల్ల వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో శనివారం 10 పంపును ప్రారంభించి 19, 20వ పైపు లైన్ ద్వారా గ్రావిటీ జలాలను ఎత్తిపోశారు. ఇప్పటికే 7వ పంపు వరకు వెట్‌రన్ నిర్వహించిన అధికారులు... ఇటీవల కాలంలో 8, 9 పంపుల వెట్‌రన్ నిర్వహించారు. వరుస క్రమంలోని 10 వ పంపు వెట్‌రన్ విజయవంతం అయింది. ఈ నెల 26న 11వ పంపుకు వెట్‌రన్ నిర్వహించి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే కార్యచరణ చేపడతామన్నారు.
ఇవీ చూడండి : సెప్టెంబరు 4 నుంచి బీఈడీ తరగతులు ప్రారంభం