ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతువేదికలో 77మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. గతంలో ఆడపిల్లలు పుడితే అమ్ముకునే పరిస్థితులుండేవని... నేడు సీఎం కేసీఆర్ చొరవతో మార్పు వచ్చిందని అన్నారు. ఆడపిల్లల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రామగుండం నియోజవర్గంలో తాను గెలిచినప్పటి నుంచి 40వేల మందికి కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను అందజేశానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లతో పాటు తహసీల్దార్ బండి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదు!