ETV Bharat / state

వ్యక్తి శరీరానికి అతుక్కుంటున్న ఇనుప వస్తువులు.. కారణం ఏంటంటే?

సహజంగా అయస్కాంతానికి ఇనుము, స్టీలు వస్తువులు అతుక్కోవడం, గమ్ముతో చెక్కలను అతికించడం చూస్తుంటాం. మానవ శరీరానికి ఇవేమి అతుక్కోవు. కానీ ఒక వ్యక్తి శరీరం మాత్రం కొన్ని వస్తువులను ఆకర్షిస్తోంది. ఇనుము, స్టీలు సామాను ఆయన శరీరం నుంచి జారిపోకుండా అలాగే ఉంటున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో...? తెలుసుకుందాం రండి...!

human body, peddapalli
ఒంటిపై అతుక్కున్న సామాగ్రి
author img

By

Published : Jun 22, 2021, 5:08 PM IST

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అక్రోజు.రమేశ్‌, శేఖర్ అన్నదమ్ములు. వీరిద్దరూ గోల్డ్ స్మిత్ పని చేస్తుంటారు. ఇటీవల రమేశ్ శరీరంలో ప్రత్యేక మార్పులు జరిగాయి. బంగారు ఆభరణాల దుకాణం నిర్వహించే రమేశ్​కు... వారం రోజుల కిందట ఓ వింతైన అనుభవం ఎదురైంది.

ఒకరోజు భోజనం చేస్తుండగా తన కుమారుడు యూట్యూబ్​లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని... సరదాగా ఓ గిన్నెను తీసుకువచ్చి శరీరంపై పెడితే అతుక్కుపోయిందని రమేశ్ తెలిపారు. మరికొన్ని ఇనుము, స్టీలు సామగ్రిని తన శరీరంపై ఉంచి చూసుకోగా... అవి విడిపోకుండా, కిందపడకుండా అలాగే ఉండిపోయాయని పేర్కొన్నారు. తను కదిలినా, గంతులేసినా జారిపోలేదని వివరించారు.

human body, peddapalli
ఆస్పత్రిలో రమేశ్

గతంలో నాకెప్పుడూ ఇలా జరగలేదు. ప్రస్తుతం నా శరీరంలో ఏదైనా మార్పులు జరిగాయేమో..! భగవంతుని అనుగ్రహమో, లేక నా శరీరంలో ఏదైనా మార్పు జరిగి ఉండవచ్చు.

- రమేశ్, వస్తువులు ఆకర్షిస్తున్న వ్యక్తి

ముత్తారం వైద్యాధికారి, పోలీసులు కలిసి రమేశ్​కు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. అక్కడ స్టీలు సామాగ్రి అతుక్కుపోవడంతో... రమేశ్ శరీరంపై పౌడర్ చల్లి మరొకసారి స్టీలు వస్తువులను అతికించడానికి ప్రయత్నం చేశారు. పౌడరు చల్లిన తర్వాత వస్తువులు కిందికి జారి పడిపోయాయి.

రమేశ్ శరీరంలో ఎలాంటి మార్పులు జరగలేదు. చెమట వల్లే స్టీలు వస్తువులు అతుక్కున్నాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. రమేశ్​కు ధైర్యం చెప్పాం.

-వంశీకృష్ణ, వైద్యుడు

నాలుగు రోజులుగా రమేశ్ గురించి ప్రచారం జరుగుతుండటంతో మంగళవారం ఉన్నతాధికారుల ఆదేశాలతో పరీక్షలు నిర్వహించాం. చెమట వల్లనే వస్తువులు అతుక్కుంటున్నాయని వైద్యులు తేల్చారు. ఈ సంఘటనపై వస్తున్న వివిధ ప్రచారాలన్నీ అవాస్తవాలే.

-రాములు, ముత్తారం ఎస్సై

వైద్యులు అతని శరీరంలో ఎలాంటి మార్పులు జరగలేదని చెబుతున్నా.. స్థానికులు మాత్రం రమేశ్ ఆకర్షణ శక్తిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

వస్తువులను ఆకర్షిస్తున్న వ్యక్తి శరీరం

ఇదీ చదవండి: YSR Cheyutha: అర్హులైన ప్రతీ మహిళకు వైఎస్సార్​ చేయూత: ఏపీ సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.