ETV Bharat / state

గోదావరిఖనిలో 97 క్వింటాళ్ల అక్రమ బియ్యం పట్టివేత - illegal rice transportation in peddapalli district

అనుమతి లేకుండా మిల్లింగ్ చేసిన బియ్యాన్ని రామగుండం టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది.

illicit rice caught at godavarikhani in peddapalli district by task force police
గోదావరిఖనిలో 97 క్వింటాళ్ల అక్రమ బియ్యం పట్టివేత
author img

By

Published : Jun 1, 2020, 11:15 AM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గౌతమీనగర్​లోని శ్రీ బాలాజీ రైస్ మిల్​లో నిల్వ చేసిన 97 క్వింటాళ్ల బియ్యాన్ని రామగుండం టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత వానా కాలంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వివిధ కేంద్రాల నుంచి కొనుగోలు చేసి శ్రీరాజరాజేశ్వర బీఆర్​ఎం ఇండస్ట్రీస్ పేరుతో అనుమతులు పొందారు. ధాన్యాన్ని అదే మిల్లులో మిల్లింగ్ చేయాల్సి ఉండగా.. శ్రీ బాలాజీ మిల్లులో మిల్లింగ్ చేయించారు.

ఆరు నెలలు నిల్వ ఉంచిన బియ్యాన్ని రాజరాజేశ్వర బీఆర్​ఎం ఇండస్ట్రీ పేరుతో పౌరసరఫరాల శాఖకు రవాణా చేయాలని నిర్ణయించారు. ఈ అక్రమ దందాపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు శ్రీ బాలాజీ రైస్​మిల్లును తనిఖీ చేయగా 97 క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. లారీల్లో లోడ్ చేసిన 95 బస్తాల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.