ETV Bharat / state

న్యాయవాదుల హత్య ప్రాంతంలో ఐజీ సందర్శన - IG visiting lawers couple murder news

న్యాయవాదులు గట్టు వామన్​రావు, నాగమణి దంపతులు హత్యకు గురైన ప్రదేశాన్ని ఐజీ నాగిరెడ్డి పరిశీలించారు. హత్యపై ప్రతిపక్షాలు, అడ్వొకేట్లు ప్రభుత్వ తీరుపై మండిపడుతుండడం వల్ల ఉన్నతాధికారులు జోక్యం చేసుకోక తప్పలేదు.

హత్య జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన ఐజీ
హత్య జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన ఐజీ
author img

By

Published : Feb 18, 2021, 11:08 AM IST

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్​రావు, నాగమణి దంపతుల హత్య కేసు ఘటనా స్థలాన్ని తెల్లవారు జామున 2.30 గంటలకు నార్త్​జోన్ ఐజీ నాగిరెడ్డి పరిశీలించారు. హత్యపై ప్రతిపక్షాలు, అడ్వొకేట్లు ప్రభుత్వ తీరుపై మండిపడుతుండడం వల్ల ఉన్నతాధికారులు జోక్యం చేసుకోక తప్పలేదు. హుటాహుటిన నార్త్​జోన్ ఐజీ నాగిరెడ్డి కల్వచర్లకు చేరుకుని సీన్ ఆఫ్ అఫెన్స్​ను పరిశీలించారు. హత్య జరిగిన తీరుపై రామగుండం సీపీని అడిగి తెలుసుకున్నారు.

హత్య స్థలిలో ఐజీ
హత్య స్థలిలో ఐజీ

కల్వచర్ల వద్ద హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్​రావు, నాగమణిల హత్య సమాచారం అందుకున్న వెంటనే అన్ని రకాల చర్యలు తీసుకున్నామని రామగుండం సీపీ సత్యనారాయణ వివరించారు. దాడిలో గాయపడ్డ న్యాయవాదులను పెద్దపల్లికి తరలిస్తుండగానే రామగిరి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో క్రైమ్ స్పాట్ డిస్టర్బ్ కాకుండా బందోబస్త్ చేయించారన్నారు.

అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న ఐజీ

మంథని సీఐ మహేందర్​ను నేర ప్రదేశం వద్ద ఇంఛార్జిగా ఉంచి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించాలని ఆదేశించినట్లు సీపీ వివరించారు. క్రైమ్ ప్రదేశం ప్రొటెక్ట్ చేయలేదన్నది పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సీన్ ఆఫ్ అఫెన్స్ స్పాట్​ను సేఫ్ గార్డ్ చేయలేదని ఆరోపించిన తర్వాత పోలీసులు చర్యలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

కారును పరిశీలిస్తున్న ఐజీ
కారును పరిశీలిస్తున్న ఐజీ

ఇదీ చూడండి: ముళ్ల కంపల సాక్షిగా.. ఆధారాలకు రక్షణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.