పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జలదీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. గోదావరిఖనిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధం చేశారు. తెరాస అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని కాంగ్రెస్ పార్టీ రామగుండం ఇంఛార్జీ ఠాగూర్ అన్నారు. శాంతియుతంగా సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడంపై మండిపడ్డారు.
రైతుల కోసం ఉద్యమిస్తాం..
ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పటి వరకు చెల్లించలేదని ఠాగూర్ ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాంత రైతులతో పాటు పరిసర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చెయ్యకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 24 గంటల్లో 11,458 మందికి కరోనా- 386 మంది బలి