ETV Bharat / state

కరోనాకాలంలో అండగా నిలవడం అభినందనీయం : కోరుకంటి చందర్​ - కరోనాకాలంలో సేవలకు గుర్తంపుగా సన్మానం

కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చిన స్వచ్ఛందసంస్థ నిర్వాహకులను రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్ సన్మానించారు. శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక 15వ వార్షికోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Honor in recognition of services NGOs during the corona pandemic time in peddapalli district
కరోనాకాలంలో అండగా నిలవడం అభినందనీయం : కోరుకంటి చందర్​
author img

By

Published : Dec 20, 2020, 10:29 PM IST

విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛందసంస్థలు, ప్రజాప్రతినిధులు ముందుకువచ్చి పేదవారికి అండగా నిలవడం అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్ అన్నారు. కరోనా కష్టకాలంలో నిరాశ్రయులకు, పేదలకు అన్నదానంతోపాటు నిత్యావసరాలు అందించి సేవలందించినందుకు స్వచ్ఛందసంస్థల నిర్వాహకులను సన్మానించారు. వారికి జ్ఞాపికలతోపాటు ప్రశంస పత్రాలను అందజేశారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక 15వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమంతో పాటు అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ధర్మశాస్త్ర వ్యవస్థాపకులు కౌటం బాబులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఎంతో మందిని చూశాం... కేసీఆర్​లాంటి సీఎంను చూడలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.