ETV Bharat / state

లాక్​డౌన్ ఎఫెక్ట్: నిత్యవసరాలకు తరలివచ్చిన జనం - telangana latest updates

కొవిడ్ మహమ్మారి కట్టడిలో భాగంగా రాష్ట్రంలో లాక్​డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఉదయం నిత్యావసరాల కోసం జనం భారీగా రోడ్ల మీదకు వచ్చారు. మంథనిలోని కూరగాయల మార్కెట్లు రద్దీగా మారాయి.

 heavy rush at groceries shop, rush at vegetable market in manthani
నిత్యావసరాల కోసం తరలివచ్చిన జనం, మంథని కూరగాయల మార్కెట్​లో జనం రద్దీ
author img

By

Published : May 12, 2021, 12:24 PM IST

కరోనా విజృంభణతో రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి లాక్​డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నిత్యావసరాల కోసం జనం పోటెత్తారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని దుకాణాల్లో రద్దీ నెలకొంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపే అనుమతులు ఉండడం వల్ల కూరగాయల మార్కెట్, కిరాణా సముదాయాలకు జనం తరలివచ్చారు. ఆర్టీసీ బస్సులు కొన్ని మాత్రమే రోడ్లపైకి వచ్చాయి.

మరికొన్నిచోట్ల కరోనా నిబంధనలు బేఖాతరు చేశారు. ఉదయం వేళ మద్యం దుకాణాలకు అనుమతులు ఉండడం వల్ల జనం బారులు తీరారు. వివాహాలు, శుభకార్యాలు నిర్ణయించుకున్న కొంతమంది ఈ లాక్​డౌన్​తో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. గతేడాది లాగా తీవ్ర నష్టాల పాలు కాకుండా కొంతమేర కార్యకలాపాలు కొనసాగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణకు తాళం పడింది.. అమల్లోకి వచ్చిన లాక్​డౌన్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.