పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు బీటూసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. మార్కండేయ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు బైరం రవివర్మ పాల్గొని 60 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు.
హైదరాబాద్కు చెందిన బీటూసీ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2800ల నిరుపేద కుటుంబాలకు సుమారు రూ. 2000 విలువ గల నిత్యావసర సరుకులు అందించినట్లు ఎండీ సతీశ్ తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ బొట్ల సతీశ్ చేస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు.