తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని పెద్దపల్లి జిల్లా ఛైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వాలు ప్రజల కోసం ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించలేదని, తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని మధు తెలిపారు.
రామగిరి మండలంలో నిర్మించిన మొట్టమొదటి వైకుంఠధామం నిర్మాణానికి ప్రభుత్వం రూ. 10లక్షల 40 వేలు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండవేన ఓదేలు యాదవ్, కమాన్పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్క, ఎంపీటీసీ. శారద, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థిత్వాల ఎంపిక