ETV Bharat / state

నంది పంపుహౌజ్​ను సందర్శించిన గవర్నర్​ తమిళిసై - GOVERNOR TAMILISAI KALESHWARAM VISIT

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌజ్​ను గవర్నర్​ తమిళిసై సందర్శించారు. భూగర్భంలో నిర్మించిన మోటార్లను నేరుగా తిలకించి... పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

GOVERNOR TAMILISAI VISIT NANDHI MEDARAM PUMP HOUSE

author img

By

Published : Dec 11, 2019, 8:03 PM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ నందిమేడారంలోని నందిపంపుహౌజ్​​ను సందర్శించారు. కాసులపల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గాన వెళ్లి నందిమేడారంలోని ఆరో ప్యాకేజీని గవర్నర్ పరిశీలించారు. భూగర్భంలో నిర్మించిన పంపుహౌజ్‌ లోపలికి వెళ్లి పంపులను తిలకించారు. మోటార్ల పని తీరును వివరించే ఫోటో ప్రదర్శనను వీక్షించారు. గవర్నర్​కు కలెక్టర్ దేవసేనతో పాటు కాళేశ్వరం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌ మోటార్ల పని విధానాన్ని వివరించారు. నీటిని ఎత్తిపోసే డెలివరీ సిస్టర్న్‌లను పరిశీలించారు. మొత్తం మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నందిమేడారం నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్​కు వెళ్లిపోయారు.

నంది పంపుహౌజ్​ను సందర్శించిన గవర్నర్​ తమిళిసై

ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.