కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా బుధవారం నుంచి సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఇళ్లల్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని పేర్కొన్నారు.
పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు 300 వరకు అనుమానితులుగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: మారకుంటే.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు: సీఎం