ETV Bharat / state

గోదావరిఖనిలో ఘనంగా గంగపుత్ర దివస్ ఉత్సవాలు - గోదావరిఖని గంగపుత్ర దివస్ తాజా వార్తలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని తిలక్​నగర్ గంగపుత్ర సంఘం కార్యాలయంలో గంగపుత్ర దివస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గంగపుత్రుల కుల దైవం గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ చల్లి ఏటా వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకున్నట్లు అఖిల భారత మహాసభ తెలిపింది.

గోదావరిఖనిలో ఘనంగా గంగపుత్ర దివస్ ఉత్సవాలు

author img

By

Published : Nov 23, 2020, 5:19 AM IST

అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాల వారోత్సవాల్లో భాగంగా సనాతన సాంప్రదాయ మత్స్యకారులు గంగపుత్రులేనని చాటిచెప్పేందుకే గంగపుత్ర దివస్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అఖిల భారత మహాసభ జాతీయ అధ్యక్షుడు సత్యం బెస్త తెలిపారు.

ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని తిలక్​నగర్ గంగపుత్ర సంఘం కార్యాలయంలో అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగపుత్ర దివస్ ఉత్సవాలు జరుపుకున్నారు.

నిజాం సర్కార్ కంటే ముందునుంచే..

నిజాం సర్కార్ కంటే ముందు నుంచే తాము చేపలు పట్టే బెస్త కులస్తులమని సత్యం తెలిపారు. అందుకే తమ కుల ఉనికి, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు గంగపుత్ర దివస్ నిర్వహించామన్నారు. అమ్మవారి చిత్రపటానికిి పసుపు కుంకుమ సమర్పించి, పూల మాలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. ప్రత్యేక గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసి గంగపుత్ర మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అందజేయాలన్నారు.

ఇవీ చూడండి : హైకోర్టు ఆదేశాలతో భాజపా అభ్యర్థి నామినేషన్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.