పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామంలో అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఊరూరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దక్షిణ భారత దేశంలో అత్యధిక జనాభా కలిగిన తమకు కేంద్ర స్థాయిలో ప్రత్యేక గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మత్స్య శాఖ మంత్రి గిరి రాజ్ సింగ్ను కోరుతున్నట్లు తెలిపారు.
కేంద్రం మంత్రులను కలుస్తాం..
త్వరలోనే కేంద్ర మంత్రులను కలిసి తమ సమస్యలను ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్రంలోని గంగపుత్ర మత్స్యకారులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని బెస్తపల్లి సర్పంచ్ తోకల శైలజ నర్సయ్య గంగపుత్ర కోరారు. రాష్ట్రంలోనే బెస్త కులస్తులు ఉన్న బెస్తపల్లి గ్రామాన్ని అత్యుత్తమంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : రెండు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టగలం: ఎంఐఎం ఎమ్మెల్యే