పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి తీరంలో రామగుండం కార్పొరేషన్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాలు సమర్పించారు. ఆషాడ మాసం చివరి ఆదివారం సందర్భంగా గంగమ్మ తల్లికి చీర, సారెతో పాటు పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు కుంకుమను గోదావరిలో వదిలారు.
వానలు సమృద్ధిగా కురవాలి..
వర్షాలు సమృద్ధిగా కురవాలని ఏటా ఘనంగా కుల దైవం గంగమ్మ తల్లికి బోనాల అర్పిస్తామని సీనియర్ గంగపుత్ర నాయకుడు తౌడబోయిన సత్యం బెస్త తెలిపారు. వానలు బాగా కురిస్తేనే తమ మత్స్య వృత్తి బాగుంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండాలని అమ్మవారిని కోరుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలందరూ సుఖ శాంతులతో విరాజిల్లాలని... రైతులకు సరిపడ నీరుండాలని గంగమ్మ తల్లిని ప్రార్థించినట్టు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా గంగపుత్రులు ఏకం కావాలి...
దేశవ్యాప్తంగా సాంప్రదాయ మత్స్యకారులందరూ కుల దైవం గంగాదేవీకి బోనాలు సమర్పించాలని సత్యం బెస్త కోరారు. ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండాలని.. కొవిడ్ మహమ్మారి నుంచి అందరినీ రక్షించాలని గంగాదేవీకి మొక్కులు సమర్పించినట్టు గోదావరిఖని మత్స్య పారిశ్రామిక సంఘం మహిళా అధ్యక్షురాలు శ్యామల బెస్త తెలిపారు. గంగపుత్రులు ఆర్థికంగా ఎదగాలని... విద్య ఉపాధిలో ముందంజలో ఉండాలని రాంనగర్ మహిళా మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షురాలు సునీత బెస్త ఆకాంక్షించారు.
కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ గంగపుత్ర సంఘం సీనియర్ నేతలు పెద్దపల్లి సుజాత, ఏర్వ సునీత బెస్త, దేశబోయిన భారతలక్ష్మి, అంబటి లక్ష్మి, పారిపెల్లి రాజలింగం బెస్త, రణవేని లక్ష్మణ్ బెస్త, తౌడబోయిన రమేష్, దేశబోయిన నారాయణ, పెద్దపల్లి పోశం, అంబటి రమేష్, ఏర్వ మోహన్, ఏర్వ ఉమా , ఏర్వ సాయికిరణ్, ఏర్వ రాహుల్, విశాల్, మాదరబోయిన కొమురయ్య, మాదరబోయిన లక్ష్మి , మాదరబోయిన రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.