ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా కొనసాగాయని రామగుండం కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో జరిగిన మూడో రోజు ఫైనల్ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
యువకులలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడం, క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం, కనుమరుగవుతున్న గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పోటీలను నిర్వహించినట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. 3రోజులుగా పోటీల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటిన 42జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కమిషనర్.. పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, సీఐలు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎర్రకోట మీద ఎగిరిన జెండా ఏంటి?