పెద్దపల్లి జిల్లా మంథనిలో 'నరేందర్ మెమోరియల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం పేదలకు ఎంతో ఉపయోగకరమని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ పేర్కొన్నారు. డా.నరేందర్ వృత్తి కొరకు తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఈ వైద్య శిబిరంలో 14 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు పాల్గొన్నట్లు మెమోరియల్ ట్రస్ట్ కుటుంబ సభ్యురాలు అనిత తెలిపారు. తమ స్వగ్రామమైన మంథనిలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఆగస్టు 3 నుంచి సచివాలయం తరలింపు ప్రక్రియ షురూ