ఓ నిరుపేద వృద్ధురాలి అంత్యక్రియలకు విజయమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు బాసటగా నిలిచి ఔదార్యం చాటారు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని విఠల్నగర్కు చెందిన వృద్ధురాలు ఇరికిల్ల లింగమ్మ మంగళవారం మృతి చెందింది. తనకు ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
విజయమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోరికంటి మణిదీప్ స్పందించారు. అంత్యక్రియల నిర్వహణకు ఆ పౌండేషన్ సభ్యులు ఇరుగురాళ్ల శ్రావణ్, మేకల అబ్బాస్ తమ వంతుగా మూడువేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు బాసటగా నిలిచిన పౌండేషన్ ప్రతినిధులను కాలనీవాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ పౌండేషన్ సభ్యులు చోప్పదండి శ్రీకాంత్, వికాస్, సృజన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఈ కామర్స్ పేరిట తెరవెనుక ఆన్‌లైన్ జూదం... యువకులకు వల