ETV Bharat / state

Flexi issue in trs: పెద్దపల్లి జిల్లాలో ఫ్లెక్సీ వివాదం... చివరకు ఏమైందంటే..

Flexi issue in trs: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ సర్వసభ్య సమావేశంలో ఫ్లెక్సీ వివాదం గొడవకు దారి తీసింది. ఎమ్మెల్సీ భానుప్రసాద్​రావు ఫోటోను చిన్న సైజులో ముద్రించారంటూ.. ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఇతర ప్రజాప్రతినిధులు వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.

flexi  issue minister koppula eshwar
సముదాయిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్​
author img

By

Published : Feb 28, 2022, 1:51 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ సర్వసభ్య సమావేశంలో ఫ్లెక్సీల వివాదం

Flexi issue in trs: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన తెరాస పార్టీ సర్వసభ్య సమావేశంలో ఫ్లెక్సీ వివాదం కలకలం సృష్టించింది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ భానుప్రసాద్​రావుకు స్థానిక నాయకులు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ నేత ఫోటోను చిన్న సైజులో ముద్రించారంటూ ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి వర్గానికి చెందిన నాయకులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

ఒక సందర్భంలో ఎమ్మెల్సీ అనుచరులు ఫ్లెక్సీని చించే ప్రయత్నం చేయగా.. మంత్రి కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకొని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని నూతనంగా పెద్దపల్లి తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇరువర్గాలకు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: Satavahana Landmarks: తేలుకుంటలో

‘శాతవాహన’ ఆనవాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.