పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూలికట్ట చెరువులో వేటకు వెల్లిన మత్స్యకారులకు అరుదైన గోల్డ్‌ఫిష్ చిక్కింది. నాలుగు కిలోల బరువున్న చేప బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. చాలా ప్రత్యేకంగా ఉన్న మత్స్యాన్ని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.
బొచ్చ చేప కంటే బంగారు వర్ణంలో ఉన్న ఈ చేపకు ధర కూడా ఎక్కువగానే పలుకుతుందని మత్స్యకారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: కష్టాల కడలిలో అక్కాచెల్లెల్లు... జీవితాల నిండా కన్నీళ్లు...