కాళేశ్వరం పథకంలో కీలకమైన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయానికి దాదాపు నెల రోజులుగా అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతీ పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి నీటిని తరలిస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరగా.. అటు ఎల్లంపల్లి నుంచి ఇటు పార్వతీ పంపుహౌస్ నుంచి ఎత్తిపోతలు నిలిపివేశారు.
ఎల్లంపల్లి జలాశయంలో పెరిగిన చేపలు ప్రవాహ సమయంలో అప్రోచ్ కాలువల్లోకి చేరి ఎల్లంపల్లి, మూర్ముర్, గోలివాడ, గుడిపేట గ్రామాల మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఒక్కో చేప కనీసం 5 నుంచి 12 కిలోల బరువున్నవి లభిస్తున్నందుకు మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేపలకోసం గోదావరిఖని, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు.
ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!