పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో బైరం రవివర్మ దర్శకత్వంలో 'యువ మేలుకో ' అనే సందేశాత్మక చిత్రం నిర్మిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణను గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రమేష్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని సీఐ అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సందేశాత్మక చిత్రాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. గత తొమ్మిదేళ్లుగా సందేశాత్మక చిత్రాలు నిర్మించిన స్థానిక దర్శకులు బైరం రవివర్మను సీఐ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సందేశాత్మక చిత్రాలను నిర్మించి యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. నటీనటులపై పలు ప్రదేశాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇదీ చూడండి : తిరువీధోత్సవాల్లో ఆలరించిన చిన్నారుల నృత్యాలు