పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజరుపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
నందిమేడారం గ్రామానికి చెందిన సామంతుల శంకరయ్య, మొదటి కొడుకు అశోక్, రెండో కొడుకు హరీష్ కలిసి చొప్పదండి మండలం రాగంపేటలోని బంధువుల ఇంట్లో జరిగిన పూజలో పాల్గొని తిరిగి వస్తున్నారు. బంజరుపల్లె వద్ద ఎదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొట్టడం వల్ల శంకరయ్య, అశోక్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్