కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా.. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్‌లో పొలాలు, భూములు మునిగిన రైతులు మంథని ప్రధాన చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాస్తారోకో నిర్వహించారు. నష్ట పరిహారం చెల్లించాలని మూడు సంవత్సరాలుగా.. అధికారులు, నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరు పట్టించుకోట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులను ఆదుకోండి..
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరిగినా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ కన్నీటిని తెప్పిస్తున్నారన్నారు. రహదారిపై సుమారు అర్ధగంట పాటు నిల్చోని రైతులను ఆదుకోండి అని నినాదాలు చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భూములకు ధర నిర్ణయించి బాధితులకు ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు రైతులందరూ ర్యాలీగా వెళ్లి మంథని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకుంటే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి: తలసాని