ETV Bharat / state

ఆర్టీసీ బస్సుల్లో చిల్లర దోపిడి - తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలు

ఇప్పటికే పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలతో ప్రయాణికులు లబోదిబోమంటుంటే.. మరోవైపు ఛార్జీలను రౌండ్​ ఫిగర్​ చేయాలని అదనపు ఛార్జీలు వసూలు చేసి ప్రయాణికుల నడ్డి విరుస్తున్నారు.

extra charges in tsrtc buses to round figure the actual price of a ticket
ఆర్టీసీ బస్సుల్లో చిల్లర దోపిడి
author img

By

Published : Dec 21, 2019, 10:21 AM IST

Updated : Dec 21, 2019, 11:23 AM IST

ఆర్టీసీ బస్సుల్లో చిల్లర దోపిడి

పెద్దపల్లి జిల్లా మంథని నుంచి కరీంనగర్​కు 74 కిలోమీటర్లు. గతంలో మంథని నుంచి కరీంనగర్​కు ప్రయాణికులు ఎక్స్​ప్రెస్​ బస్సులో-రూ.66 చెల్లించి ప్రయాణం చేసేవారు. ఆర్టీసీ ఛార్జీల పెరుగుదలతో ఇప్పుడు రూ.85 రూపాయలు వసూలు చేస్తున్నారు.

జిల్లా ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో రూ.15 రూపాయలు పెంచారు. అంటే మంథని-కరీంనగర్​ ప్రస్తుత ఛార్జీ (రూ.66+రూ.15) రూ.81 రూపాయలుండాలి.. కానీ చిల్లర కోసం ఆ ధరను ఏకంగా రూ.85లకు పెంచారు. ఒక్కొక్క ప్రయాణికుడి వద్ద రూ.4 చొప్పున దోపిడి జరుగుతోంది.

రూ.81లు ఉన్న ఛార్జీని రూ.80లకు తగ్గిస్తే సౌలభ్యంగా ఉంటుందని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే పెరిగిన ఛార్జీలు తమపై పెనుభారాన్ని మోపుతుండగా.. ఈ అదనపు ఛార్జీలు రోజు బస్సులో ప్రయాణించే సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని వాపోతున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Dec 21, 2019, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.