పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లకు జిల్లా జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ 25కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. దాతల సహకారంతో సుమారు 85మంది ఆటో డ్రైవర్లకు, 25మంది ఆశా వర్కర్లకు సాయం చేసినట్లు తెలిపారు.
నిరుపేదలకు సాయం చేయటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నియమాలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.