ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట రిలే నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పీఆర్సీ 2018 ప్రకటించి, పెండింగ్లో ఉన్న 3 డీఏలను విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. పదోన్నతులు కల్పించడం, పెండింగులో ఉన్న అంతర్ జిల్లా బదిలీలు వెంటనే చేపట్టాలని నినాదాలు చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల రిలే దీక్షకు పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పాటు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: హీరో రాజశేఖర్ కోలుకోవాలని చిరు ట్వీట్