కరీంనగర్ జిల్లా రామగుండం పరిధిలో లాక్డౌన్ అమలు తీరును డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అన్ని ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బయట తిరిగేవారిని గుర్తించేందుకు డ్రోన్ నిఘాను ఏర్పాటు చేసినట్లు రామగుండం కమిషనరేట్ ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఆపరేట్ చేస్తూ పట్టణంలోని లాక్డౌన్ అమలు తీరును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తూ లేనివారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తూ ఎక్కడైనా గుంపులుగా కనిపిస్తే పోలీసులు వెంటనే చర్యలు చేపడుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఉపేందర్, గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రమేష్ బాబు, ఎస్సై ఉమా సాగర్, రమేష్, సతీష్లతోపాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అమానవీయం: ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి