ETV Bharat / state

గోదావరిఖని ప్రథమ వైద్యుడు ఇక లేరు

ఏమ్మా... నీ ఆరోగ్యం ఎట్ల ఉంది. బలానికి మంచి మందులు రాసిస్తా. క్రమం తప్పకుండా వేసుకో. తగ్గిపోద్ది. నీకేం భయం లేదు. నేనున్నా కదా. ఇలాంటి మాటలు చెప్పే వైద్యుడు ఉంటే రోగం సగం నయమైనట్లే కదా. సరిగ్గా అలాంటి ఆప్యాయతతో చికిత్స కోసం తన వద్దకు వచ్చే వారికి తొలుత మనోధైర్యం కల్పిస్తారు. ఆ తర్వాతే తన వైద్య మందులతో వ్యాధిని పూర్తిగా మటుమాయం చేస్తారు. ఆయనే డాక్టర్ రాజం. అలాంటి గొప్ప వైద్యుడు అనారోగ్యంతో కన్నుమూశారు.

ఖని ప్రథమ వైద్యుడు ఇక లేరు
ఖని ప్రథమ వైద్యుడు ఇక లేరు
author img

By

Published : Sep 5, 2020, 3:13 AM IST

Updated : Sep 5, 2020, 3:29 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండ కార్పొరేషన్ పరిధి గోదావరిఖని ప్రథమ వైద్యుడు డాక్టర్ రాజం బెస్త కన్నుమూశారు. గోదావరిఖని ప్రాంత ప్రజలకు సుదీర్ఘంగా సేవలు అందించిన పేదల వైద్యుడు (76) అనారోగ్యంతో మరణించారు. 3 నెలల కిందట ఆయన భార్య మరణించగా... నాటి నుంచి డాక్టర్ రాజం మానసికంగా కుంగిపోయారు. కేరళకు చెందిన విజయలక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్య అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ.

కరీంనగర్​లో తుది శ్వాస...

గత కొద్ది రోజులుగా డాక్టర్ రాజం ఒంట్లో చెక్కర స్థాయిలు పడిపోయి వారం క్రితమే కోమాలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో కరీంనగర్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం గోదావరి నది తీరాన రాజం అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. రాజంకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కొడుకు శ్రీనివాస్ బెస్త గోదావరిఖనిలోనే కంటి వైద్యుడిగా పనిచేస్తున్నారు.

సంతాపంగా ఆస్పత్రలు బంద్..

గోదావరిఖని ప్రాంత తొలి వైద్యుడి మృతికి సంతాపంగా పట్టణ వ్యాప్తంగా ఆస్పత్రులు బంద్ ప్రకటించాయి. చేపలు పట్టే బెస్త కులంలో జన్మించిన డాక్టర్ రాజంకు చదువుపై మక్కువ ఎక్కువ. కష్టపడి చదివి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్షలో రెండో ర్యాంక్ సాధించారు. ఎన్నో ప్రభుత్వ , కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవకాశాలు వచ్చినా తృణప్రాయంగా వదిలేసుకున్నారు.

సొంత ఊరు కోసం..

తాను పుట్టి పెరిగిన బొగ్గు ప్రాంత వాసుల సంరక్షణ కోసం 1973లో గోదావరిఖనిలోనే వైద్య సేవలు ప్రారంభించారు. పెద్దపల్లి , మంచిర్యాల జిల్లా వాసులతో పాటు మహారాష్ట్ర లోని సిరివంచ నుంచి రోగులు వచ్చేవారు.

చౌరస్తా వరకు క్యూ..

ఆ కాలంలో పట్టణ కేంద్రంలోని లక్ష్మీనగర్ దవాఖాన నుంచి ప్రధాన చౌరస్తా వరకు వైద్యం కోసం క్యూ లైన్లు కట్టేవారు. ఎన్నో కేంద్ర , రాష్ట్ర సంస్థల్లో ఆయన మెడికల్ ఆఫీసర్​గా పని చేశారు. డాక్టర్ రాజం రోగుల నుంచి ఓపి ఫీజు తీసుకునే వారు కాదు. డబ్బులు లేవని చెప్పే రోగులకు మందులు కూడా ఉచితంగానే పంపిణీ చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనం కూడా పెట్టేవారు.

డా.రాజం కాలనీగా పెట్టాలనే యోచన...

డాక్టర్ రాజం నివాస కాలనీకి ఆయన పేరే పెట్టేందుకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సహకారంతో కృషి చేస్తామని రామగుండం మేయర్ డా. అనిల్ కుమార్ తెలిపారు.

పేదల వైద్యుడి లోటు పూడ్చలేం : సత్యం బెస్త

పేదల వైద్యుడు, గోదావరిఖని గంగపుత్ర సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ రాజం బెస్త మరణం పట్టణ వాసులకు తీరని లోటని సీనియర్ గంగపుత్ర నాయకుడు తౌడబోయిన సత్యం బెస్త తెలిపారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందాలని... చికిత్స లేక ఏ ప్రాణం పోకూడదనే గొప్ప సంకల్పంతో రాజం వైద్య వృత్తిలో కొనసాగారని స్పష్టం చేశారు. ఫలితంగానే ఆయన ప్రజా వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారని సత్యం కీర్తించారు. ప్రస్తుత కాలం వైద్యులు డా. రాజం అడుగు జాడల్లో నడవాలని... ప్రజలకు మంచి వైద్యాన్ని అందుబాటులో ఉంచాలన్నారు.

రోగికే అధిక ప్రాధాన్యత..

డాక్టర్ రాజం రోగికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని గంగపుత్ర సంఘం మరో నాయకుడు అర్కెటి రాంచందర్ బెస్త గుర్తు చేసుకున్నారు. ఆయన బతికి ఉంటే కీలక కరోనా సమయంలో ప్రజలకు ఇంకొన్నాళ్లు నాణ్యమైన సేవలు అందించేవారని అభిప్రాయపడ్డారు. రాజం స్ఫూర్తిగా వైద్యరంగం సమూలంగా స్వచ్ఛంద ప్రక్షాలన కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఇవీ చూడండి : 'నిరంతర వైద్యసేవలకు అదనపు సిబ్బందిని నియమిస్తాం'

Last Updated : Sep 5, 2020, 3:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.