ETV Bharat / state

మేడారం: శునకం ఎత్తు బంగారంతో మొక్కులు - పెంపుడు శునకం ఎత్తు బంగారం తూకం వేసి వన దేవతలకు మొక్కు

అనుకున్నవి నెరవేరితే నిలువెత్తు బంగారం సమ్మక్క-సారలమ్మ దేవతలకు మొక్కులు తీర్చుకోవటం చూస్తుంటాం.. కానీ పెంచుకున్న పెంపుడు శునకం ఎత్తు బంగారం తూకం వేసి వన దేవతలకు మొక్కు తీర్చుకున్నారు. ఈ సంఘటన గోదావరిఖనిలో జరిగింది.

Dog height is gold for the gods at godavarikhani
మేడారం దేవతలకు శునకం ఎత్తు బంగారం
author img

By

Published : Feb 2, 2020, 9:48 PM IST

పెంచుకున్న పెంపుడు శునకం ఎత్తు బంగారం తూకం వేసి సమ్మక్క సారలమ్మ దేవతలకు మొక్కు తీర్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఐబీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్‌రావు, శ్వేత దంపతులు పెంపుడు జాతి శునకంను పెంచుకుని జెర్సీ అని పేరు పెట్టుకున్నారు. ముద్దుగా పెంచుకుంటున్న జెర్సీ అనుకోకుండా కనిపించకుండా పోయింది. చాలా రోజులు వివిధ ప్రాంతాలలో వెతికినా దొరకలేదు. జెర్సీ దొరకకపోవడం వల్ల ఏం చేయాలో తెలియలేదు.

మేడారం దేవతలకు శునకం ఎత్తు బంగారం

జెర్సీ తిరిగి దొరికితే సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు శునకం ఎత్తు బంగారం మొక్కు చెల్లించుకుంటామని ఆ దంపతులు మొక్కుకున్నారు. అమ్మవారికి మొక్కిన రెండు రోజుల్లో శునకం తిరిగి ఇంటికి వచ్చింది. అమ్మవారి దయతోనే శునకం ఇంటికి వచ్చిందని సంతోషపడ్డారు. మొక్కుకున్న విధంగా ఆ దంపతులు జెర్సీ ఎత్తు బంగారు తూకం వేయించి మొక్కును చెల్లించుకున్నామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : విద్యుద్దీప కాంతుల్లో.. మేడారం జాతర.!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.