Scissors in woman stomach for six years: ఆపరేషన్లు చేసి కడుపులో సెల్ఫోన్లు మరిచిపోవడం, చిప్‌లు పెట్టి వారిని ట్రాక్ చేయడం ఈ మధ్య వస్తున్న సినిమాల్లో చూస్తున్నాం. అంతే కాదు మహిళలకు ప్రసవం సమయంలో ఆపరేషన్లు చేసి వారి కడుపులో కత్తెరలు, గ్లౌజ్‌లు, బ్లేడ్లు మరిచిపోవడం కూడా సినిమాల్లో చూసే ఉంటాం.. కానీ అది రీల్ లైఫ్ మూడు గంటల ముచ్చట.. ఎలాగైనా నడుస్తోంది. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం సినిమాల సన్నివేశాలు తలపించేలా ప్రవర్తించారు.. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు. వారి నిర్లక్ష్యం కారణంగా గత ఆరేళ్లుగా ఓ మహిళ నరకం అనుభవిస్తోంది. ప్రసవానికి వచ్చినప్పుడు వైద్యులు పొట్టలో కత్తెరను మరిచిపోయి కుట్లు వేయడంతో ఆ మహిళ ఇప్పుడు నరకయాతన అనుభవిస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఇది జరిగింది: 2017వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు పొట్టలో కత్తెరను మరిచిపోయారు. దీంతో గత ఆరేళ్లుగా ఆమె కడుపు నొప్పితో బాధపడుతోంది. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది బాధ ఎక్కువ కావడంతో.. భరించలేని స్థితిలో తన కడుపు నొప్పికి గల కారణం ఏంటో తెలుసుకొందామని పెద్ద ఆసుపత్రిలో చేరింది.
మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఆమెకు స్కానింగ్ చేయగా.. పొట్టలో కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ మహిళతో పాటు కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఆమెకు శస్త్రచికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. దీంతో వారు ఏం చేయాలో తెలియక సమాచారం బయటకు వెళ్లకుండా పొట్టలోని కత్తెరను తీసేందుకు ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించింది. స్కానింగ్‌కు సంబంధించిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కాగా ఆ జిల్లాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
ఇవీ చదవండి:
క్యాన్సర్ రోగి కడుపులో 30 కిలోల కణితి.. వైద్యుల ఆపరేషన్‌తో లక్కీగా!
'ప్రైవేట్ పార్ట్స్, గుండెను చీల్చి.. యువతికి, ఫ్రెండ్స్‌కు ఫొటోస్ పంపాడు'
కోడి కోసం వెళ్లి చిరుత బోనులో చిక్కుకున్న దొంగ
రూపాయి చిల్లర లేదన్న కండక్టర్.. ప్రయాణికుడి మూడేళ్ల పోరాటం.. ఆర్టీసీకి రూ.3వేలు ఫైన్