తెలంగాణ జూనియర్ ఇంటర్ జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ పోటీలు కొనసాగుతున్నాయి. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన దివంగత తెలంగాణ ఉద్యమకారుడు పారుపల్లి వైకుంఠపతి స్మారకార్థం ఈ పోటీలను ఈనెల 11న ప్రారంభించారు. శనివారం రాత్రి నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి.
వివిధ జిల్లాలకు చెందిన వాలీబాల్ క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం నృత్యాలతో చిన్నారులు అలరించారు. మంటల చుట్టూ ఆడుతూ వాలీబాల్ క్రీడాకారులు సందడి చేశారు. ఈ పోటీలు ఆదివారం ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నల్లమల అడవుల్లో ఆందోళన కలిగిస్తున్న అగ్నిప్రమాదాలు