ETV Bharat / state

మహిళా కార్మికులకు కూరగాయల‌ పంపిణీ - గోలివాడ చంద్రకళ బెస్త

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరిధిలోని గౌతమి నగర్​లో ఎస్ఆర్ఆర్ ఇండస్ట్రీస్ మహిళా కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ, ఎస్ఆర్ఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

మహిళా మిత్ర సంస్థ ఆధ్వర్యంలో కూరగాయల అందజేత

author img

By

Published : May 31, 2020, 12:46 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ పారిశ్రామిక మహిళా కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. మహిళా కార్మికులకు వారానికి సరిపడా కూరగాయలను మహిళా మిత్ర అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ బెస్త అందించారు. ఆలు గడ్డ, వంకాయ, ఉల్లిగడ్డ, మిర్చి, బెండకాయ, టమాట, సొరకాయ, దొండకాయ తదితరాలను సమకూర్చారు.

అందుకు స్త్రీలే కృషి చేయాలి..

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని చంద్రకళ బెస్త సూచించారు. ప్రతి ఇంట్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని... ఇందుకు స్త్రీలే కృషి చేయాలని ఆమె కోరారు. కార్యక్రమానికి సహకారం అందించిన విజయలక్ష్మి, క్రాంతి, జమున, సురేష్ , లలితను సంస్థ అధ్యక్షురాలు చంద్రకళ అభినందించారు. అనంతరం మహిళా కార్మికులు, తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు.

వారు ఇబ్బంది పడకూడదనే !

లాక్​డౌన్ నేపథ్యంలో ఎస్ఆర్ఆర్ ఇండస్ట్రీ మహిళా కార్మికులు ఇబ్బంది పడకూడదనే ఈ కార్యక్రమం చేపట్టామని సంస్థ ఛైర్మన్ సుధాకర్ తెలిపారు. కార్యక్రమంలో మహిళా మిత్ర నేతలు పొట్టునూరి అంజమ్మ, తాళ్లపెల్లి కీర్తి, తాళ్లపెల్లి రవళిలతో పాటు మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవీ చూడండి : పొంచి ఉన్న ముప్పు.. కరోనా వైరస్​ జీవాయుధమేనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.