మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన ఆరెవెళ్లి సాయిప్రియ... కోటపల్లిలోని ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు రెసిడెన్సియల్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. తన తండ్రి వసంత్... సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా... చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కరీంనగర్ నుంచి చెన్నూరుకు మృతదేహన్ని అంబులెన్స్‌లో తరలిస్తున్నారు.
వాంతి అని చెప్పి దూకేసింది...
ఆ వెనుకే కారులో కుటుంబసభ్యులతో ఉన్న సాయిప్రియ గోదావరిఖని గోదావరి నది వంతెనపైకి రాగానే వాంతి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే వాహనాన్ని వంతెనపై పక్కకు నిలిపారు. వాహనం దిగిన సాయిప్రియ చూస్తూండగానే.. నదిలోకి దూకేసింది. ఏం జరుగుతుందో తెలిసే లోగానే సాయిప్రియ నదిలో మునుగుతూ కనిపించింది. కుటుంబసభ్యులు, అక్కడున్న వారు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు సమాచారం అందించగా.... ఘటన స్థలానికి చేరుకుని జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఒకవైపు తండ్రి మరణించిన దుఃఖంలో ఉండగా... కూతురు నదిలో దూకటం కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వసంత్‌కు 8 మంది సంతానం కాగా... సాయిప్రియ చిన్న కూతూరు. సాయిప్రియ నదిలో దూకిన చిత్రాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ