ETV Bharat / state

'సకాలంలో... వేలం పాట నిర్వహించి పత్తిని కొనుగోలు చేయాలి'

మార్కెట్ యార్డ్​కు తెచ్చిన పత్తిని సకాలంలో కొనుగోలు చేయాలని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్​ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఆన్​లైన్​ పద్ధతిలో పత్తిని కొనుగోలు చేస్తే గిట్టుబాటు ధర రావడం లేదంటూ వాపోయారు.

cotton-farmers-protest-at-peddapalli
'సకాలంలో... వేలం పాట నిర్వహించి పత్తిని కొనుగోలు చేయాలి'
author img

By

Published : Dec 15, 2020, 7:06 PM IST

అమ్మకానికి తీసుకొచ్చిన పత్తిని సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్​లో రైతులు ఆందోళన చేశారు. పత్తి కొనుగోళ్లలో అధికారుల జాప్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉదయం మార్కెట్​ యార్డ్​కు తీసుకొచ్చిన పత్తిని మధ్యాహ్నం మూడు అయినప్పటికీ కొనుగోలు చేయలేదని రైతులు వాపోయారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ఆన్​లైన్​లో కొనుగోలు ఆలస్యం కావడమే కారణమని తెలిపారు.

వేలం వేయాలి..

మార్కెట్​కు తీసుకొచ్చిన పత్తిని బహిరంగంగా వేలంపాట నిర్వహించాలని అధికారులను పలుమార్లు కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్​లైన్ పద్ధతి ద్వారా క్వింటాల్ పత్తికి గిట్టుబాటు ధర రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి మార్కెట్ అధికారులతో మాట్లాడారు. రేపటి నుంచి సకాలంలో పత్తి కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్​తో పాటు మార్కెట్ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: నిబంధనలు గాలికొదిలేశారు.. స్కూల్లో పరీక్షలు నిర్వహించేశారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.