పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎంగిలి బతుకమ్మను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పితృ అమావాస్య రోజే ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు పేర్చారు. అధిక మాసం కారణంగా... వచ్చే నెల 16 నుంచి బతుకమ్మను జరుపుకోవాలని పండితులు సూచించినా... పద్ధతి ప్రకారమే పండుగను నిర్వహించేందుకు మహిళలు ముందుకొచ్చారు.
సాయంత్రం 6 గంటలకు బతుకమ్మలతో వీధుల్లోకి చేరి.. ఆటలు ఆడారు. కోలాటాలతో పాటలు పాడారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి భక్తిని చాటుకున్నారు.
ఇదీ చూడండి: ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు... తీరొక్క పూలు పేర్చి ఆట పాటలు