నూతన రెవెన్యూ బిల్లును శాసనసభలో ఆమోదించడం పట్ల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో తెరాస నేతలు సంబురాలు నిర్వహించారు. రాజీవ్ రహదారిపై బాణసంచా కాల్చి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
రెవెన్యూ విభాగాన్ని ప్రక్షాళన చేస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నట్లు తెరాస నేతలు వెల్లడించారు. ప్రజాసంక్షేమం కోసం నూతన రెవెన్యూ బిల్లును తీసుకొచ్చిన సర్కారుకు అండగా నిలవాలని ప్రజలకు సూచించారు.