ETV Bharat / state

bjp: అప్పుడు కుంభకోణాలు.. ఇప్పుడు అభివృద్ధి - తెలంగాణ వార్తలు

నరేంద్ర మోదీ(Narendra Modi) అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని భాజపా నిర్ణయించింది. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో భారతీయ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మోదీ బాధ్యతలు చేపట్టక ముందు కుంభకోణాలకు నిలయంగా ఉన్న దేశం ఆ తర్వాత అభివృద్ధివైపుగా దూసుకుపోతోందని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు.

bjp, blood donation
భాజపా, రక్తదాన శిబిరం
author img

By

Published : May 30, 2021, 2:20 PM IST

నరేంద్రమోదీ(Narendra Modi) ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. భారతీయ జనతా ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి కాశీ పేట శివాజీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జవహర్ నగర్​లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ప్రారంభించారు. భాజపా పిలుపుతో దేశవ్యాప్తంగా లక్ష గ్రామాల్లో రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు దేశం అనేక కుంభకోణాలకు నిలయంగా ఉండేదని… ఆ సమయంలోనే బాధ్యతలు స్వీకరించిన ప్రధాని దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించారని కొనియాడారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా(corona) బారిన పడి ఇబ్బంది పడుతున్న వారికి భాజాపా(bjp) కార్యకర్తలు అండగా ఉంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజాపా నాయకులు కౌశిక హరి మల్లికార్జున్, జక్కుల నరహరి, మారం వెంకటేష్, దుబాసి మల్లేష్, కల్వల సంజీవ్, రాచకొండ కోటేశ్వర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Covid vaccine: 'జూన్​లో 12 కోట్ల టీకా డోసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.