నిబంధనలకు విరుద్ధంగా నిజామాబాద్ నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రవాణా చేస్తున్న నిషేధిత బయో ఎరువులను టాస్క్ఫోర్స్ పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి నిషేధిత ఎరువులు దిగుమతి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ హైదరాబాద్కు చెందిన టాస్క్ఫోర్స్ అధికారులు మాటువేసి పెద్దపల్లిలో అక్రమంగా రవాణా జరుగుతున్న ఎరువులను పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 30 బస్తాల ఎరువులను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండిః 'ఈవీఎం' రాజకీయంలో ఇంకెన్ని మలుపులో..?