ETV Bharat / state

మంథనిలో భాజపా ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ - మంథనిలో భాజపా ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా మంథనిలో భాజపా ఆధ్వర్యంలో ద్విచక్రవాహన​ ర్యాలీ నిర్వహించారు.

మంథనిలో భాజపా ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ
author img

By

Published : Sep 15, 2019, 3:09 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో ద్విచక్రవాహన​ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్​ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామన్నారు. పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ద్విచక్రవాహన ర్యాలీ చేసినందుకు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మంథనిలో భాజపా ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ

ఇదీ చదవండిః యురేనియం నిక్షేపాలున్నా... అనుమతివ్వం: కేటీఆర్

పెద్దపల్లి జిల్లా మంథనిలో ద్విచక్రవాహన​ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్​ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామన్నారు. పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ద్విచక్రవాహన ర్యాలీ చేసినందుకు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మంథనిలో భాజపా ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ

ఇదీ చదవండిః యురేనియం నిక్షేపాలున్నా... అనుమతివ్వం: కేటీఆర్

Intro:తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని బైక్ ర్యాలీ నిర్వహించి ధర్నా చేసిన భారతీయ జనతా పార్టీ.
పెద్దపల్లి జిల్లా మంథని లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు మంథని పాత పెట్రోల్ బంక్ నుండి మంథని పట్టణ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన భారతీయ జనతాపార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య.
కాసిపేట లింగయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాకముందు, తెలంగాణ ప్రాంతం కొంతభాగం మహారాష్ట్రలో, కొంతభాగం కర్ణాటకలో కొన్ని జిల్లాలు కలిసి ఉండేవని, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ధర్నాలు నిర్వహించి , తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ,నేడు సెప్టెంబర్ 17 వ రోజును తెలంగాణ విమోచన దినాన్ని పక్కన పెట్టడం ఎంతవరకు సబబు అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలను వీడియోలను సెల్ ఫోన్ లో మీడియా ముందు చూపించారు. తాను మాట్లాడిన మాటలే ఇప్పుడు గుర్తు చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించ కుంటే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై తామే జెండా ఎగర వేస్తామని హెచ్చరించారు. మంథని పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా బైకు ర్యాలీ నిర్వహించినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై మంథని పోలీసులు కేసు నమోదు చేశారు.
బైట్: కాసిపేట లింగయ్య భారతీయ జనతాపార్టీ ,పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు


Body:యం.శివప్రసాద్, మంథని.


Conclusion:9440728281.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.